తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు అధికారులు.తిరుపతి రెడ్డికి ఎలాంటి హోదా లేకపోయినా ఆయనకు ఎదురు వెళ్లి వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. మరోవైపు పరేడ్ సమయంలో విద్యార్థుల కాళ్ళకు షూస్, చెప్పులు లేకుండా పిల్లలను ఎండలో నిల్చోబెట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.