చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో రెండు నెలలు ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా.. పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన ప్రభుత్వం.. తాజాగా మరో రెండు నెలలు పొడిగించింది.