ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి ప్రధాన పంట కాలువలో డ్రాగన్ పడవ, ఈత పోటీలు ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.