చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? చలికాలంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చలిని తట్టుకునేందుకు ఎక్కువగా వేడిని సహజంగానే కోరుకుంటాం. చలికాలంలో ఎక్కువగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది.
జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఎక్కువే
సహజంగా చలికాలంలో జలుబు, జ్వరం, దగ్గు వస్తాయి. రోగనిరోధక శక్తి కూడా చలికాలంలో తగ్గుతుంది. అందువల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి చలికాలంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది.
వేడి నీటితో ఎంత మేలో…
కావున చలికాలంలో వేడి నీటిని ఉదయం తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీటితో పాటు చలికాలంలో ఎక్కువగా జామ, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి, రేగు పండ్లు, పియర్, అరటి, ఆపిల్ పండ్లు తీసుకోవడం మంచిది. ఎక్కువగా రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సీ ఉపయోగపడుతుంది. కావున విటమిన్ సీ ఎక్కువగా ఉంటే ఆహారాన్ని తీసుకోవాలి.