రక్తంలో వచ్చే సమస్యలు మీకు తెలుసా..? రక్త ప్రసారం లేక పోతే ఏ అవయవం పనిచేయదు. రక్తంలో ఎక్కువగా వచ్చే సమస్యలు రక్తం గడ్డకట్టడం, ఎంబాలిజం, థ్రోబోంసిస్. కొలెస్ట్రాల్ పెరగడం వలన రక్తంగడ్డ కడుతుంది. మనిషి శరీరంలోని పలు అవయవాల్లో ఈ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె, మెదడు, కాళ్లు, చేతులు, ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టడానికి ముఖ్యంగా పొగతాగడం, మద్యం సేవించడం వల్ల సంభవిస్తుంది. జన్యుపరమైన లోపాలతో ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల కూడా రక్తం గడ్డకడుతుంది. దూరప్రయాణాలు చేయడం వల్ల డీహైడ్రేషన్ కు గురి అవడం వల్ల కూడా రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. వీటితో పాటు రక్తంలో మార్పు వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది.
Read More: రక్తంలోని కణాలు వాటి సంఖ్య..జబ్బు చేసిందని తెలుసుకోవడం ఎలా..?
థ్రోంబోసిస్ లక్షణాలు :
థ్రోంబోసిస్ అనే వ్యాధి శరీరంలోని కాళ్లలో, చేతుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల వస్తుంది. వయస్సు పెరిగిన వారితో పాటు క్యాన్సర్ వచ్చిన వారిలో థ్రోంబోసిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా రక్తం చిక్కబడే స్వభావంతో కూడా థ్రోంబోసిస్ వస్తుంది. బరువు పెరగడం, పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా థ్రోంబోసిస్ వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా కాళ్లలో వాపు, నొప్పి, ఎరుపు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ థ్రోంబోసిస్ వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులకు చేరి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.
శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టి థ్రోంబోసిస్ వ్యాధికి దారి తీస్తుంది. గాయం నుండి రక్తస్రావం అయినప్పుడు రక్తం శరీరంలో గడ్డలుగా ఏర్పడుతుంది. ఇది నాళాల లోపల జరిగితే అది పూర్తిగా మూసివేయబడుతుంది. రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటి థ్రోంబోసిస్ గుండెకు దారితీసే సిరల్లో అభివృద్ధి చెందుతుంది. అలాగే గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులలో కూడా రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది.
డీప్ వేయిన్ థ్రోంబోసిస్ అంటే…
రక్తనాళాల్లో రక్తప్రవాహం ఆగిపోవడం వల్ల రక్తం గడ్డకడుతుంది. కండరం పొరలోపల రక్తనాళంలో గడ్డలు ఏర్పడితే దానిని (డి.వీ.టీ)డీప్ వేయిన్ థ్రోంబోసిస్ అంటారు. డి.వీ.టి వల్ల కాళ్లలో వాపు ఏర్పడుతుంది.
పల్మోనరీ ఎంబోలిజం…
ఊపిరితిత్తుల్లోని రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని పల్మోనరీ ఎంబోలిజం అంటారు. కొవిడ్ 19 టీకా వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో థ్రోంబోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.