కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని లాభాలో కాలేయం వ్యాధుల :
కాలేయం పనితీర బాగుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కాలేయం శరీరానికి అవసరమైన శక్తిని చేరవేస్తూ..వ్యర్థాలను మలం, మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఇంత ముఖ్యమైన అవయవం కాలేయం
కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని లాభాలో, కాలేయం గురించి తెలుసుకోవాలని ఉందా.. మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం కాలేయం. కాలేయానికి వ్యాధి వస్తే మన శరీరంలోని అన్ని అవయవాల మీదా ఆ ప్రభావం చూపిస్తుంది. కాలేయం వ్యాధులు ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పవచ్చు. అందులో మొదటిది ఆల్కహాల్ తీసుకోవడం, రెండవది హైపటైటిస్(సి), హైపటైటిస్ (బి) వైరస్ లు, మూడవది కొవ్వు పెరగడం వల్ల వచ్చే కాలేయ సంబంధిత వ్యాధి (ఫ్యాటీ లివర్), నాల్గవది కామెర్లు. మనం తీసుకునే ప్రతీది కాలేయం నుంచే బయటకు పోవాల్సి ఉంటుంది. ఆల్కహల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయం సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనిని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. కాలేయం పనిచేయడం ఆపేస్తే మనిషి ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉంది. ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ వంటివి కూడా కాలేయం వ్యాధికి కారణం అవచ్చు. హెపటైటిస్ (సి), హెపటైటిస్ (బి) అనే కాలేయ వ్యాధులు వైరస్ వల్ల వస్తాయి. రక్త పరీక్షల ద్వారా వైద్యులు హెపటైటిస్ (సి), హెపటైటిస్ (బి) కాలేయ వ్యాధులను నిర్ధారణ చేస్తారు. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల కూడా కాలేయం వ్యాధి వస్తోంది. ఈ వ్యాధి ఆయిల్ ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వారికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధిని వైద్యులు రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. కామెర్లు అనే కాలేయ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కండ్లు పచ్చగా అవుతాయి. ఇవే కాకుండా రోగులు మందులను ఎక్కువగా తీసుకోవడం వలన కూడా కాలేయానికి ముప్పు ఉంటుంది.