Saturday, May 31, 2025

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!

Must Read

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!

భారతీయ సినీ చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించేదిగా చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను భారత్ ఒడిలో చేరాయి. ఏకంగా రెండు అవార్డులు రావడంతో అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనైతే సందడి వాతావరణం నెలకొంది. ఇక, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సంతోషం అంతాఇంతా కాదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం తర్వాత నిర్వహించిన బ్యాక్ స్టేజ్ పార్టీలో దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు యార్లగడ్డ పట్టరాని ఉత్సాహంతో కనిపించారు. భారతీయత ఉట్టిపడేలా వీళ్లు వేసుకున్న వస్త్రధారణకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -