లవ్ ఎఫైర్పై స్పందించిన శ్రద్ధా కపూర్.. అబద్ధాలు భరించలేకే అంటూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాతో డేటింగ్ చేస్తున్న శ్రద్ధా తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధాలు చెబితే తనకు నచ్చదన్నారు. రిలేషన్షిప్లో అబద్ధాలు చెప్పినా, మోసం చేసినా తాను తట్టుకోలేనన్నారు. అలాంటి టైమ్లో వారిని వదిలేసి, మన పని మనం చూసుకోవడమే ఉత్తమమని ఆమె పేర్కొన్నారు. అబద్ధాలు, మోసాలతో ప్రేమ ముందుకు సాగదని స్పష్టం చేశారు.