Thursday, September 19, 2024

కాఫీ విత్ కరణ్ షో.. దీపికా ఎఫైర్లపై భారీ ట్రోలింగ్!

Must Read

సెలబ్రిటీల లవ్ లైఫ్ గురించి ఎన్నో గాసిప్స్, రూమర్స్ రావడం వింటూనే ఉంటాం. ఫలానా హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, ఫలానా హీరోయిన్ ఒక హీరోతో ఎఫైర్ నడుపుతోంది లాంటి వార్తలు సోషల్ మీడియాలోనూ వస్తుంటాయి. అయితే వీటిల్లో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సెలబ్రిటీలు చెబితే గానీ నమ్మలేని పరిస్థితి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే.. బాలీవుడ్ లో ఎఫైర్లకు సంబంధించిన పుకార్లు బాగా వస్తుంటాయి. రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె లాంటి సెలబ్రిటీల అఫైర్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే వచ్చాయి.  

ఎందరితో ప్రేమాయణం నడిపినా చివరకు అలియా భట్ నే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు రణ్ బీర్ కపూర్. దీపికానేమో రణ్ వీర్ సింగ్ ను మ్యారేజ్ చేసుకుంది. అటు కత్రినా విక్కీ కౌశల్ ను వివాహమాడింది. అయితే వీళ్లందరికీ భయంకరమైన పాస్ట్, బ్రేకప్ లు, లవ్ ఎఫైర్లు ఉన్నాయనేది తెలిసిందే. కానీ వీటిల్లో రణ్ బీర్ కపూర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. దీపికాను రణ్ బీర్ మోసం చేశాడని.. అలియాతో ఎఫైర్ నడుపుతూ ఆమెకు ద్రోహం చేశాడని రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా దీపిక మాటల్ని బట్టి చూస్తే అనవసరంగా అందరూ రణ్ బీర్ ను తిట్టుకున్నారు గానీ.. అసలు తప్పు దీపికాదేనని అనిపిస్తోంది.

గతంలో తనకు డేటింగ్ అంటే ఏంటో తెలియదని, ఇష్టం లేదన్నట్లుగా పలు సందర్భాల్లో దీపిక మాట్లాడింది. అయితే కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ షోలో మాత్రం తాను నలుగురైదుగురితో డేటింగ్ చేశానని చెప్పింది. ఆ ఎఫైర్ల నుంచి బయటకు వచ్చేందుకు కొన్నాళ్లు సింగిల్ గా ఉన్నానని తెలిపింది. ఆ టైమ్ లోనే రణ్ వీర్ సింగ్ ప్రపోజ్ చేయడంతో అతడికి కమిట్ అయ్యానని పేర్కొంది. వేరే వాళ్లతో రిలేషన్ లో ఉన్నా తన మనసులో, మైండ్ లో మాత్రం ఎప్పుడూ రణ్ వీర్ ఉంటాడని, అతడికే కమిట్ అయ్యానని దీపిక చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్ని అఫైర్లు ఉన్నాయి కాబట్టే దీపికను రణ్ బీర్ కపూర్ వదిలేశాడని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -