టాలీవుడ్ లో సూపర్ హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల దాకా అందరూ సాయిపల్లవి అభిమానులే. ఆమె గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు గొప్పగా చెప్తూ ఉంటారు. తాజాగా తమన్నా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఏప్రిల్ 18న విడుదల కానుంది. సంపత్ నంది దర్శకత్వపర్యవేక్షణలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు, నిర్మాణం, దర్శకత్వపర్యవేక్షణ బాధ్యతల్ని సంపత్ నంది నిర్వహించారు. ఈ మూవీ ప్రమోషన్లలో తమన్నా బిజీగా ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ‘ఇష్టం అయిన హీరోయిన్ ఎవరు’ అని ప్రశ్నించడంతో తమన్నా బదులిస్తూ.. ‘ఐ లవ్ సాయిపల్లవి.. చాలా అందంగా ఉంటుంది. ఆమె స్పెస్ లో ఆమె ఇండివిజువల్‌గా ఉంటుంది. యాక్టింగ్ డాన్స్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. యూనిక్ గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ హ్యాపీగా ఈ వీడియో షేర్ చేస్తున్నారు.