వణికిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
కొవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా దేశంలో రెండు మరణాలు నమోదవ్వడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి ఆఖరు నాటికి ఇది తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సెంట్రల్ గవర్నమెంట శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కేసుల మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే చాన్స్ ఉందని అంచనా వేసింది.