టాలీవుడ్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారితో కలిసి పండుగ జరుపుకొన్న విష్ణు.. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణుకు మాతృశ్య సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.