ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల లిక్కర్ కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ అందిస్తోంది. అయితే, దీనికి భారీ డిమాండ్ రావడంతో...
రాష్ట్రంలో మత కల్లోలాలకు కొందరు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. కొందరు వ్యక్తులు రహస్యంగా శిక్షణ తీసుకొని, హిందువులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ.. సోమవారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని కోరారు. తెలంగాణలో ఎన్ని దారుణాలు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం సమన్లు పంపింది. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లోనూ కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్‍ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈమేరకు పవన్ కళ్యాణ్ కు సమన్లు...
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని మోపడానికి.. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోందన్నారు. ఇండ్లల్లో వినియోగించే విద్యుత్ 300 యూనిట్లు దాటితే...
ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలను చూశారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా రుషికొండ భవనాలను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట విశాఖ ఎంపీ భరత్, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులున్నారు. రుషికొండ పర్యటన అనంతరం...
నారాయణ కాలేజీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన విద్యార్థిని అనూష, హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవుల తర్వాత తల్లిదండ్రులు ఆదివారం ఆమెను కాలేజీలో వదిలేసి వెళ్లారు. అనూష స్పృహ కోల్పోయిందని సోమవారం పేరెంట్స్ కు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి...
కడపలో ప్రేమ ఉన్మాది చరిత్ర ఇదే!
మాట్లాడుకుందామని నమ్మించాడు.. తీరా అడవుల్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశాడు. ఇదీ ఇటీవల కడప జిల్లాలో జరిగిన అఘాయిత్యం. ఈ ఘోర హత్య ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్న చరిత్ర, అసలు కారణాలు తెలుసుకుందాం.
కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమ ఉన్మాది విఘ్నేశ్.....
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో ఆయన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్...
ఏపీలో వరుస అత్యాచారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో బాలికలు అత్యాచారాలకు గురవుతుంటే.. సీఎం, డిప్యూటీ సీఎం షూటింగ్ లలో ఉన్నారని విమర్శిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక ఖాతాల్లో వరుస పోస్టులు పెడుతున్నారు. రెడ్ బుక్ పాలనలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే 74 మంది మహిళలపై...
విజన్ 2047కు పోలీసులు సిద్ధం కావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. విజయవాడకు వచ్చిన వరదల్లో కానీ, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, ఇంద్రకీలాద్రి పై నవరాత్రులు కానీ, పోలీసులు బాగా పని...