Thursday, March 19, 2026

News

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో భాగమేనని యశోద ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి వారికి...

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్...

ఏపీ హైకోర్ట్ జ‌డ్జికి త‌ప్ప‌ని సోష‌ల్ మీడియా వేధింపులు

సోష‌ల్ మీడియాలో వేధింపుల‌కు హ‌ద్దు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా హైకోర్టు జ‌డ్జికి సైతం వేధింపులు త‌ప్ప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు సోషల్...

క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి షాకిచ్చిన కోర్టు

భారత పేసర్ మహ్మద్ షమీకి కోల్‌క‌తా కోర్టు షాకిచ్చింద‌. తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని ష‌మీని కోర్టు ఆదేశించింది. అయితే షమీ స్థాయికి ఈ భరణం చాలా తక్కువ అని, తాము రూ.10 లక్షల వరకు కోరామని షమీ మాజీ భార్య హసీన్ జహాన్...

ఆ మ‌ర‌ణాల‌కు కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాదు – కేంద్రం

క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌ల ఒకే జిల్లాలో గుండెపోటుతో ప‌లువురు చ‌నిపోవ‌డానికి కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందారు. అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో.. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి ఏమైనా సంబంధం...

తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ మేర‌కు తెలంగాణ సీఎస్‌ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు హైకోర్టు పిటిష‌న్ నోటీసులు జారీ చేసింది. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖ‌లైంది. మున్సిపాలిటీల్లో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని...

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేద‌ని మండిప‌డ్డారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు...

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా రామ‌చంద‌ర్ రావు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయ‌న‌కు ఆదేశం అందింది. సోమ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా పార్టీలోని పెద్ద‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంటుంద‌ని...

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఆల‌స్యంపై హైకోర్టు సీరియ‌స్‌

మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శ‌నివారం విచారించింది. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు...

రేపు తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంత‌రం డీఎస్‌ విగ్రహ ఆవిష్కరణ చేయ‌నున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు భారీ ఏర్పాట్లు...

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...