Saturday, May 2, 2026

News

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి!

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో మంగళవారం రాత్రి ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వెట్టాలో షావానీ స్టేడియంలో బలోచిస్థాన్ నేషనల్ పార్టీ నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ దాడి జరిగింది....

భారత్‌పై విధించిన సుంకాలు సరైనవే – ట్రంప్

భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలు ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, భారత్‌ అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందన్నారు. భారత్‌ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ, అమెరికా ఉత్పత్తులపై...

షెల్ కంపెనీలతో వ్యాపారుల‌కు మ‌హిళ టోక‌రా!

హైదరాబాద్‌లో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, నకిలీ వర్క్ ఆర్డర్లతో బడా వ్యాపారవేత్తలను నమ్మించి వందల కోట్లు వసూలు చేసింది. తాజాగా సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్టైన మహిళ పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేకపోయినా, తెలివితేటలతో వ్యాపారవేత్తలను బురిడీ కొట్టింది. దాదాపు 40...

వైయ‌స్ఆర్‌కు జ‌గ‌న్ ఘ‌న నివాళి

దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌ వద్ద మంగళవారం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో అమోఘమైన ముద్రవేసిన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైయ‌స్ఆర్‌ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నాయకులు కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సీఎం వైయ‌స్‌...

పవన్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు. లోకేష్ తన సందేశంలో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు....

వరదల నష్టం నివారణపై సీఎం రేవంత్ స‌మీక్ష‌

ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, చెరువులు, భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరదల కారణంగా...

ఏపీకి రెండు రోజులు భారీ వాన‌లు

ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వాతావరణ మార్పు ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో...

సూడాన్‌లో మహావిపత్తు.. వెయ్యి మందికి పైగా మృతి

ప్రకృతి ఆగ్రహం ముందు మనిషి ఎంత బలహీనుడో మరోసారి స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘటన మరువకముందే, ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో ప్రకృతి విధ్వంసకరరూపం ప్రదర్శించింది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా మట్టికరిపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ...

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...

ఉప రాష్ట్రపతి ఎన్నికలపై జగన్ క్లారిటీ

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరిన సందర్భంలో, ముందుగానే ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తామని హామీ ఇచ్చామని, అందువల్ల తమ వైఖరి మారబోదని జగన్ ఆయనకు స్పష్టంచేశారు....

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...