Monday, January 26, 2026

News

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ విజన్‌ వివ‌రించిన సీఎం రేవంత్‌

ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు గూగుల్, ఇజ్రాయెల్, యూఏఈ వంటి అంతర్జాతీయ భాగస్వాములు మద్దతు ప్రకటించగా, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, వాతావరణ, పట్టణ సమస్యల పరిష్కారంలో సహకారం అందించడానికి ఆసక్తి చూపారు. గూగుల్ వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది....

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో ఎంపీకి ఈడీ నోటీసులు!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో...

అధికారుల ఒత్తిడితో హెల్త్ సెక్రటరీ మృతి!

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీ బలయ్యారనే ఆరోపణలు కడపలో కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న జి. విజయకుమారి (42) అకస్మాత్తుగా మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్‌సీలో...

మేడారం గ‌ద్దెలు పునః ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఉదయం 6 గంటలకే కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు సతీమణి, కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించి...

సంగారెడ్డి నుంచి జీవితంలో పోటీ చేయ‌ను – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నియోజకవర్గంతో రాజకీయంగా ఇక సంబంధం పెట్టుకోనని తేల్చిచెప్పారు. శ‌నివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోసం ఏఐసీసీ...

బీహార్‌లో సహస్రలింగం ప్రతిష్టాపన పూర్తి

ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బీహార్‌లోని కేసరియాలో కొలువుదీరింది. విరాట్ రామాయణ మందిర్‌లో 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ శివలింగం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగంగా గుర్తింపు పొందింది. ఈ భారీ శివలింగాన్ని తమిళనాడులో దాదాపు పదేళ్ల పాటు ప్రత్యేకంగా తయారు...

ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా గెలిచింది – ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాభిమానంతో వచ్చిన విజయం కాదని, పూర్తిగా కుట్రపూరితంగా, అక్రమంగా సాధించిన గెలుపని అన్నారు....

భారత్‌పై సుంకాలు విధించ‌డం త‌ప్పు – రిపబ్లికన్‌ నేత విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో దేశాలపై విధిస్తున్న సుంకాల‌పై విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన రిచ్ మెక్‌కార్మిక్ ట్రంప్ పాలసీలపై చర్చలో భారతదేశంతో త‌ప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. “భారత్ అమెరికాకు పెట్టుబడులు తీసుకు వస్తుంది....

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మొంథా’ తుఫాను తీవ్ర నష్టం కలిగించినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన...

‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్.. ప‌లు జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి మరోసారి బలహీనపడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. కరైకాల్‌కు 120 కి.మీ., పుదుచ్చేరికి 90 కి.మీ., చెన్నైకి 150 కి.మీ. దూరంలో ఉంది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...