Monday, April 27, 2026

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!

Must Read

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!

ఈమధ్య క్రిప్టో కరెన్సీ వినియోగం బాగా పెరిగింది. క్రిప్టో లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల్లాంటి వర్చువల్‌ అసెట్స్‌ నియంత్రణ మీద కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్‌ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో దేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఇక మీదట అనుమానాస్పద లావాదేవీలు ఏవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇండియా (ఎఫ్‌ఐయూ-ఐఎన్‌డీ)కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో విధానాల్లో జనరేట్‌ చేసిన కోడ్‌ లేదా నంబరు లేదా టోకెన్‌లను వర్చువల్‌ డిజిటల్‌ అసెట్లుగా పరిగణిస్తారనేది తెలిసిందే.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -