Sunday, June 15, 2025

అమూల్ పాల ధర తగ్గింపు

Must Read

ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరలను తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్‌పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు.

తగ్గించిన ధరల ప్రకారం.. అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66 (పాతధర) నుంచి రూ.65 (కొత్తధర)కు, అమూల్ తాజా రూ.54 నుంచి రూ.53కు, అమూల్ టీ స్పెషల్ రూ.62 నుంచి 61కి అందుబాటులోకి వచ్చింది. అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల హైక్వాలిటీని కొనసాగిస్తూ వినియోగదారులకు మరింత లబ్ది చూకూర్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు జయేన్ మెహతా ఒతెలిపారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -