ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ వ్యాపారాలు నిర్వహించాలి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అమరావతికి మంజూరైన రైల్వే లైన్ విజయవాడ సమీపంలోని...
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీపైనే అసహనం వెళ్ళగక్కారు. కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీ నేతలకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య...
ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల దర్శనానికి ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు వస్తే టీటీడీ ఈవో తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. అదే ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం వస్తే స్పెషల్ దర్శనాలు చేయిస్తున్నామని తెలిపారు. ఏపీలో మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు....
భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరారు. కాజన్ నగరంలో జరిగే 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ మోడీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మధ్య ఆసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఇటీవల సికింద్రాబాద్ లో ఓ దుండగుడి చేతిలో ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహాన్ని మంగళవారం పునర్ ప్రతిష్ఠించారు. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించనున్నారు. తొలిరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం హాజరయ్యారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం...
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల లిక్కర్ కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ అందిస్తోంది. అయితే, దీనికి భారీ డిమాండ్ రావడంతో...
రాష్ట్రంలో మత కల్లోలాలకు కొందరు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. కొందరు వ్యక్తులు రహస్యంగా శిక్షణ తీసుకొని, హిందువులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ.. సోమవారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని కోరారు. తెలంగాణలో ఎన్ని దారుణాలు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం సమన్లు పంపింది. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లోనూ కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్‍ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈమేరకు పవన్ కళ్యాణ్ కు సమన్లు...
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని మోపడానికి.. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోందన్నారు. ఇండ్లల్లో వినియోగించే విద్యుత్ 300 యూనిట్లు దాటితే...
ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలను చూశారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా రుషికొండ భవనాలను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట విశాఖ ఎంపీ భరత్, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులున్నారు. రుషికొండ పర్యటన అనంతరం...