Wednesday, February 11, 2026

Today Bharat

వరదల నష్టం నివారణపై సీఎం రేవంత్ స‌మీక్ష‌

ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, చెరువులు, భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వరదల కారణంగా...

ఏపీకి రెండు రోజులు భారీ వాన‌లు

ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వాతావరణ మార్పు ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో...

సూడాన్‌లో మహావిపత్తు.. వెయ్యి మందికి పైగా మృతి

ప్రకృతి ఆగ్రహం ముందు మనిషి ఎంత బలహీనుడో మరోసారి స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘటన మరువకముందే, ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో ప్రకృతి విధ్వంసకరరూపం ప్రదర్శించింది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా మట్టికరిపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ...

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...

ఉప రాష్ట్రపతి ఎన్నికలపై జగన్ క్లారిటీ

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన పార్టీ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరిన సందర్భంలో, ముందుగానే ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తామని హామీ ఇచ్చామని, అందువల్ల తమ వైఖరి మారబోదని జగన్ ఆయనకు స్పష్టంచేశారు....

ప‌వ‌న్ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో చెప్పండి – పేర్ని నాని

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారంటే, వేలాది మంది కార్మికుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చేదని...

మణిపూర్‌ పర్యటనకు సిద్ధమైన మోడీ

2023లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండే అవకాశముందని సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని ఇంఫాల్‌తో పాటు హింసకు తీవ్రంగా గురైన చురాచంద్‌పూర్ జిల్లాను కూడా సందర్శించి, నిరాశ్రయ శిబిరాల్లో ఉన్న...

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం – మంత్రి కోమ‌టిరెడ్డి

తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక తెరలేవనుంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నట్లు సమాచారం. తొలి...

సెప్టెంబరులో భారీ వ‌ర్ష‌పాతం – ఐఎండీ హెచ్చరిక

దేశంలో సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా ఈ నెలలో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, అయితే ఈ ఏడాది 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా వెల్లడించారు. ఈ వర్షాల ప్రభావంతో ఉత్తరాఖండ్‌లో నదులు ఉప్పొంగి...

గణేష్ నిమజ్జనంలో విషాదం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఆనందోత్సాహంగా సాగుతున్న ఊరేగింపులో అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. నిమజ్జనం కోసం వెళ్తున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img