బంగారం, వెండి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్న తరుణంలో, ఇండియన్ కరెన్సీ రూపాయి కూడా షాక్ ఇచ్చింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మార్కెట్లలో వ్యక్తమవుతోంది. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి...
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న అటల్ పెన్షన్ యోజనను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది....
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించబడ్డారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు తమ వైఖరిని స్పష్టంగా వ్యక్తపరచారు. హరీష్ రావు మాట్లాడుతూ, “మాకు...
సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు...
భారతీయ జనతా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన...
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారించడంపై స్పందిస్తూ, ఇది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని అన్నారు. న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు...
ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు గూగుల్, ఇజ్రాయెల్, యూఏఈ వంటి అంతర్జాతీయ భాగస్వాములు మద్దతు ప్రకటించగా, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, వాతావరణ, పట్టణ సమస్యల పరిష్కారంలో సహకారం అందించడానికి ఆసక్తి చూపారు. గూగుల్ వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో...
ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీ బలయ్యారనే ఆరోపణలు కడపలో కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న జి. విజయకుమారి (42) అకస్మాత్తుగా మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్‌సీలో...