దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పెద్ద అలర్ట్ వెలువడింది. ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే ఇండిగో విమానం లండన్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే బ్రిటిష్...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ వేసింది. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ కాంగ్రెస్ బలపడింది. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు రోజులు సాగే ఈ సదస్సు కోసం విశాఖ సముద్ర తీరం అందంగా ముస్తాబైంది. నగర ప్రధాన మార్గాలను విద్యుత్ దీపాలతో...
భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రయత్నించాడు. ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమేనని, భారత్ రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఉపయోగిస్తోందని ఆరోపించాడు. ఒక టీవీ కార్యక్రమంలో ఆసిఫ్ ఈ...
కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంగారుపాళెం మండలం టేకుమందలో సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై...
ఢిల్లీ వాయు కాలుష్యం పెరుగుదలకు పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలు తగలబెట్టడం ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఈ మేరకు...
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన...
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా ఉద్రిక్తత రెచ్చగొట్టినట్టు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు మరింత ఉధృతమవుతోంది. సిట్ ముందు హీరో విజయ్ దేవరకొండ, యూట్యూబర్ సిరి హనుమంతు హాజరయ్యారు. విజయ్‌ను రెండు గంటలు, సిరిని నాలుగు గంటలు అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాలు, డబ్బు రాకపోకలు, యాప్ సంస్థలతో ఒప్పందాలు గురించి వివరాలు అడిగారు. ఆర్థిక లావాదేవీల ఆధారాలు...
ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాలనే ఉద్దేశంతో చేయలేదని, ఇబ్బంది పెట్టడం లేదా పరువు దెబ్బతీయడం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నానని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.