వైఎస్ జగన్ ఎమోషనల్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అని, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. గడప దాటితే హిందూ, ఇస్లాం, సిక్కు, బౌద్ధ మతాలను గౌరవిస్తానని తెలిపారు. పాదయాత్ర...
చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది...
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన చేయాలని వైఎస్ జగన్ భావించారు. కానీ జగన్ పై దాడికి కుట్ర పన్నారని పార్టీ వర్గాల నుంచి తెలియడంతో పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో పెను ముప్పు తప్పింది. మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో కటౌట్ కాలిపోయింది....
ఇక అయోధ్యకు నేరుగా ఫ్లైట్
తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ – అయోధ్య మధ్య కొత్త సర్లు మొదలుకానున్నాయి. ఈ రూట్లలో వారానికి నాలుగు సార్లు విమాన సేవలు నడపనున్నారు.
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ నిజాయతీ గల పొలిటికల్ లీడర్ అని, ఎంతో ధైర్యవంతుడని కొనియాడారు. ప్రజాభిమానం చూరగొనేందుకు రాహుల్ ఎంతో శ్రమించారని తెలిపారు. తనపై వచ్చిన...
భారీ అంచనాలతో తెరకెక్కిన దేవర సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కాంబోలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా మొత్తం ఊపేస్తోంది. ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? పాత్రలు ఎలా ఉన్నాయి? దర్శకుడు...
కొందరు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్ట ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అన్నది హైకోర్టులో చెప్పాలన్నారు. ఫార్మా సిటీ కోసం గతంలో 14 వేల ఎకరాల...
మనూ బాకర్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఇప్పటివరకు తాను గెలుచుకున్న పతకాలను అభిమానులకు చూపించారు. ఆ పతకాల కోసం తాను పడిన శ్రమను వివరించారు. ఆమె మాటల్లోనే.. ‘‘నేను షూటింగ్‌లో ప్రయాణం ప్రారంభించినప్పుడు నాకు 14 ఏళ్లు. ఇంత దూరం చేరుతానని ఎప్పుడూ ఊహించలేదు. మీరు ఏదైనా ప్రారంభించిన తర్వాత,...
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీ!
దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర రేపే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఉదయం 1.30 గంటలకే ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రిబుకింగ్ లోనూ రికార్డులు సృష్టించింది....