Friday, March 13, 2026

Today Bharat

వరద సాయంపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...

మోడీ హయాంలో జేబులు లూటీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మంగళవారం హర్యానాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. మోడీ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదోడిపై పన్నులు విధుస్తూ పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో రూ.350 ఉండే సిలిండర్ ధర...

లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత

తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ వాయిదా వేశామన్నారు. కేసు తీవ్రత వల్లే సిట్ ను ఏర్పాటు చేశామని.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు చేపడతామన్నారు.

మూసీలో కూల్చివేతలు షురూ

మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు

గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి ఈ దుశ్చర్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పేదోడికి సుప్రీం అండ!

విద్యకు పేదరికం అడ్డురాకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐఐటీ ధన్ బాద్ లో సీటు పొందిన అటుల్ కుమార్ అనే వ్యక్తి.. పేదరికం కారణంగా నిర్ణీత గడువులోగా అడ్మిషన్ ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతని అడ్మిషన్ ను రద్దు చేస్తూ.. సదరు విద్యా సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ.. అటుల్...

మూసీ ప్రక్షాళనలో భారీ స్కామ్!

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపించారు. 2400 కిలోమీటర్ల మేర ఉన్న గంగా నది ప్రక్షాళనకు కేవలం రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తే.. 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మూసీ నది ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. మూసీ...

తిరుమల లడ్డూ వ్యవహారం..చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు.’...

డీఎస్సీ ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2.45 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పరీక్షలు రాశారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి....

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం!

హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహించింది. నగరంలోని పలుచోట్ల కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చట్టప్రకారం వ్యవహరించడం లేదని పేర్కొంది. ‘శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img