Thursday, November 19, 2026

బంగ్లాదేశ్ లో మళ్లీ రాజకీయ హింస

Must Read

బంగ్లాదేశ్ దేశంలో మరోసారి రాజకీయ హింస చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చిన లాక్ డౌన్ కు ముందే దేశవ్యాప్తంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాజధాని ఢాకాతో సహా దాదాపు 28 జిల్లాల్లో నాటు బాంబులు పేలడం మరియు పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో మహ్మద్ యూనస్ కు చెందిన గ్రామీణ బ్యాంక్ శాఖలతో పాటు చిట్టగాంగ్ లోని ఆయన పూర్వీకుల ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు.

మరోవైపు ప్రధాని తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్ పీ కార్యకర్తలు ఢాకాలోని ఇద్దరు అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడి చేసి నిప్పంటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమ నరైల్ జిల్లాలో బీఎన్ పీ చేపట్టిన ర్యాలీపై జరిగిన దాడిలో ఇద్దరు స్థానిక నాయకులు ప్రాణాలు కోల్పోగా ఫరీద్ పూర్ మరియు పిరోజ్ పూర్ ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. వరుస హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఇందిరా గాంధీకి ప్రధాని మోడీ నివాళులు

భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ఆమె...
- Advertisement -

More Articles Like This

- Advertisement -