Monday, October 5, 2026

ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

Must Read

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా అంశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా వార్డుల సరిహద్దుల ఫ్రీజింగ్ కు సంబంధించిన అంశంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపాలిటీ సరిహద్దుల ఫ్రీజింగ్ నిబంధన వార్డులకు వర్తించదని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు.

మరోవైపు ఎస్ఐఆర్ ఆధారంగా కొత్త ఓటర్ల జాబితా పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించకుండా కొత్త జాబితా సిద్ధమైన తరువాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై తదుపరి విచారణను శుక్రవారం చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. మోకాలి మిట్ట ప్రాంతంలో వేకువజామున సుమారు రెండు గంటల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -