Monday, June 8, 2026

కేసీఆర్‌కు సిట్ నోటీసులు

Must Read

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఇప్పటికే కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ స్పందించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సిట్ విచారణకు తక్షణమే హాజరుకావాలా? లేక కొంత గడువు కోరాలా? అనే అంశంపై కేసీఆర్ ఆలోచనలో ఉన్నారని సమాచారం. మూడు రోజుల తర్వాత గానీ, లేదా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక గానీ విచారణకు హాజరవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి నిర్ణయంపై స్పష్టత కోసం ఆయన పార్టీ ముఖ్య నేతలు, లీగల్ సెల్ సభ్యులతో సమావేశం కానున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -