Thursday, March 12, 2026

మేడారం గ‌ద్దెలు పునః ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఉదయం 6 గంటలకే కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు సతీమణి, కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించి భక్తులకు అంకితం చేయనున్నారు. అలాగే మేడారంలో అభివృద్ధి చేసిన పలు జంక్షన్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 7:45 గంటలకు హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు, స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై కేబినెట్ స్పష్టతనిచ్చింది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గర చేయాలని, పెండింగ్‌లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -