Wednesday, November 26, 2025

తెలంగాణలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్

Must Read

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పోలింగ్‌కు 15 రోజుల సమయం ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. రెండు, మూడు దశలు నాలుగు రోజుల తేడాతో డిసెంబర్ 15, 19 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 545 మండలాలు, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఏర్పాట్లు పూర్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -