Thursday, January 15, 2026

బెట్టింగ్ భూతానికి యువ‌కుడు బ‌లి

Must Read

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువ‌త బ‌ల‌వుతూనే ఉన్నారు. ప్ర‌భుత్వాలు దీనిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా ఈ చావులు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో యువ‌కుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బ‌ల‌య్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్‌గా ప‌ని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్‌కు బానిసగా మారి స్నేహితులు, పరిచయస్తుల దగ్గర దాదాపు రూ.10 లక్షల వ‌ర‌కు అప్పు చేశాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని మందలించారు. అప్పులు తీర్చే మార్గం లేక‌, కుటుంబ‌స‌భ్యుల మాట‌ల‌తో మ‌నోవేద‌న‌కు గురైన వంశీ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -