Monday, September 1, 2025

హెచ్‌సీయూ ఇష్యూపై సుప్రీం సీరియ‌స్‌

Must Read

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాల‌ని పేర్కొంది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడి చేయ‌డం ఆందోళ‌న క‌లిగించింద‌న్నారు. అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికేశార‌ని అని ప్ర‌శ్నించింది. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్‌ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. త‌దుప‌రి తీర్పు వ‌ర‌కు వరకు ఆ భూముల్లో ఒక్క చెట్టును నరకవద్దని ఆదేశించారు. హెచ్‌సీయూ భూముల్లో స్టేటస్‌ కో కొనసాగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -