ఎండాకాలంలో ఒక్కపూట బడులు చూసి ఉంటాం. కానీ, చలికాలంలోనూ పాఠశాలల సమయాల్లో మార్పులు వచ్చాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమ్సింగ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు బడులు నడపాలని సర్కారు ఆదేశించింది. మిగిలిన జిల్లాల విద్యార్థులు కూడా పాఠశాలల పని వేళలు మార్చాలని అభ్యర్థిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే కోరుతున్నారు. ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.