Friday, November 22, 2024

దేశ వ్యాప్తంగా ‘అదానీ’ అలజడి.. ఏం జరిగిందో పూర్తి కథనం!!

Must Read

దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా పేరొందిన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం కలకలం రేపింది. రాజకీయంగా పెను దుమారం రేగడంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీతో పాటు మరో ఎనిమిది మందిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలు కేసు ఎందుకు నమోదు అయింది? దేశ రాజకీయాల్లో ఎందుకు అలజడి నెలకొంది? మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి? పూర్తి కథనం తెలుసుకుందాం.
కేసు ఇందుకే..
అదానీ గ్రూప్ ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకుంది. ఇవి పొందడానికి ఆయా రాష్ట్రాల్లోని అధికారులు, ముఖ్య వ్యక్తులకు ముడుపులు పంపించారని తేలింది. ఈ ముడుపులు అమెరికాలోని పారిశ్రామికవేత్తలను మోసం చేసి, వాటిని లంచాలుగా మార్చారన్నది ప్రధాన అభియోగం. అమెరికా పారిశ్రామికవేత్తలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. అయితే, ఈ కేసును అడ్డుకునేందుకు కెనడాకు చెందిన ఓ కంపెనీతో అదానీ చేతులు కలిపారని కూడా మరోకేసు నమోదైంది. గౌతమ్ అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
దేశంలో ఏం జరిగిందంటే..
దేశంలోని సోలార్ పవర్ ప్లాంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెకీ 2019లో టెండర్లు పిలిచింది. ఇందులో నాలుగింటిని అజూర్ పవర్, ఎనిమిదింటిని ఆదానీ గ్రూప్ దక్కించుకున్నాయి. సెకీ ఆధ్వర్యంలో ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్తును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయి. తద్వారా ఆయా సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. కానీ, సోలార్ విద్యుత్ కు డిమాండ్ తగ్గడం, మార్కెట్ కంటే అధిక ధరను అజూర్,అదానీ కోట్ చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో, తాము తయారు చేసిన సోలార్ విద్యుత్ ను అధిక ధరకు కొనుగోలు చేసేలా లంచాల ఆశ చూపించాయి. ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యక్తులు, అధికారులకు ముడుపులు అప్పగించాయి.
అమెరికాలో కేసు ఎందుకంటే..
అదాన్ గ్రూప్ లంచాలు ఇవ్వడానికి అమెరికాలోని బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచి నిధులు కూడబెట్టిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఇన్వెస్టర్లకు సంబంధం ఉంటే విదేశాల్లోని అవినీతి వ్యవహారాన్ని పరిశీలించేందుకు అమెరికా కోర్టులు అనుమతి ఇస్తాయి. దీంతో అదానీ కంపెనీపై కేసు నమోదు అయింది.
మార్కెట్ డౌన్ ఎందుకంటే..
అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ప్రభావం ఇండెక్స్ లపై పడింది. అదానీ గ్రూప్ షేర్లు 22శాతం పతనమయ్యాయి. పెట్టుబడుదారులకు రూ.5.27లక్షల కోట్లు నష్టపోయారు. అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి రూ.8,683 కోట్ల నష్టం వాటిల్లింది.
రాజకీయ ప్రకంపనలు..
ఐదు రాష్ట్రాల్లోని ప్రముఖులకు అదానీ గ్రూప్ ముడుపులు అందించారని విచారణలో తేలడంతో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా ఏపీలో ఈ ఆరోపణలు మరింత కలకలం రేపాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే ఈ ముడుపులు అందాయని అధికారపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీని అరెస్ట్ చేసి, లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ అక్రమాలపై ముందు నుంచి తమ పార్టీ నిజాలు చెబుతోందన్నారు. అదానీ గ్రూపుల్లో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టడం కూడా కుట్రలో భాగమేనన్నారు. దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక...
- Advertisement -

More Articles Like This

- Advertisement -