Monday, September 1, 2025

రేవంత్ రెడ్డికి తమ్మినేని వార్నింగ్!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగా ఉన్నామని, ఇక నుంచి రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎం పార్టీకి గెలవకపోయినా, ఓడించడం తెలుసని చురుకలు అంటించారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పనితీరు మార్చుకోవాలన్నారు. అవసరానికి మించి కాంగ్రెస్ నేతలకు సలాం కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అడుగులకు మడుగులు వత్తుతున్న పోలీసులు.. డ్రెస్సులు విప్పి మూడు రంగుల కాంగ్రెస్ జెండా వేసుకొని తిరగాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -