Tuesday, July 1, 2025

సికింద్రాబాద్ లో టెన్షన్ టెన్షన్

Must Read

ఇంటర్నెట్ బంద్.. భారీగా పోలీసులు

ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై బజరంగ్ దళ్ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. వేలాది మంది హిందువులు ఆలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వీరికి సంఘీభావం తెలిపారు. హిందువుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. ఈక్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా హిందువులు తరలివస్తున్నారని సమాచారం వచ్చింది. పరిస్థితి చేయిదాటే అవకాశం ఉండడంతో పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేశారు. ఈక్రమంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బజరంగ్ దళ్ కు మద్దతుగా సిటీలోని హిజ్రాలు, జోగినీలు ఆలయానికి చేరుకున్నారు. అందరూ ముక్తకంఠంతో నిరసన తెలిపారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -