Monday, October 20, 2025

రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామ్ చంద్రారావు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళనను పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్,బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి,చేస్తున్నవి.. అన్నీ వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో తన కుటుంబసభ్యుల పేరు మీద ఫామ్ హౌజ్ ఉందన్నారు. తమ ఫామ్ హౌజ్ బఫర్ జోన్ లో ఉందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయన్నారు. తమ ఫామ్ హౌజ్ ఎఫ్ టీఎల్ లో గానీ బఫర్ జోన్ లో కానీ లేదని, ఒకవేళ ఉంటే కూల్చివేయాలన్నారు. తన ఫామ్ హౌజ్ పరిధిని గుర్తిస్తే సొంత ఖర్చుతో తానే కూల్చివేస్తానన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -