Friday, September 20, 2024

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!

Must Read

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!

చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఇటీవలే మొదలైన ఈ చాట్బాట్ వరల్డ్వైడ్గా మంచి ఫలితాలను అందిస్తోంది. కానీ కొన్నిచోట్ల మాత్రం విఫలమవుతోంది. అయినప్పటికీ ఫ్యూచర్లో గూగుల్కు పోటీగా వచ్చే చాన్స్ ఉందని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీడియా రంగంలోనూ ఈ తరహా సాంకేతికతను తీసుకొచ్చింది న్యూస్ జీపీటీ అనే సంస్థ. దాని పేరే న్యూస్జీపీటీ (వార్తాజీపీటీ). పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో తయారు చేసిన ఈ వార్తాజీపీటీ మున్ముందు మీడియా రంగంలో పనిచేసే వారు జాబ్స్ను కోల్పోయేలా చేస్తుందని సాక్షాత్తు దీన్ని క్రియేట్ చేసిన సీఈవో అలాన్ లెవీ పేర్కొన్నారు.

పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఈ న్యూస్బాట్ ప్రపంచంలోనే తొట్టతొలి వార్తాజీపీటీగా నిలవనుంది. దీని ఆవిష్కరణతో మీడియాలో పనిచేసే వారి జాబ్ సేఫ్టీకి కచ్చితంగా ముప్పు వాటిల్లుతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే వార్తాజీపీటీ కృత్రిమ మేధస్సుతో ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఒక న్యూస్ ఛానెల్లా పనిచేస్తుందని ఆ కంపెనీ తెలిపింది. మొత్తంగా మీడియా ప్రపంచంలో ఈ న్యూస్బాట్ ఓ గేమ్ ఛేంజర్గా మారనుందని లేవీ అంటున్నారు. జర్నలిస్టులు లేకుండా, అలాగే ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా వరల్డ్వైడ్గా ఉన్న పాఠకులు, వీక్షకులకు.. నిష్పాక్షికమైన, వాస్తవ ఆధారిత వార్తలను అందిస్తామని న్యూస్ జీపీటీ చెప్పుకొచ్చింది. న్యూస్ జీపీటీని newsGPT.ai అని టైప్ చేసి దీని సేవలను ఫ్రీగా పొందొచ్చని సంస్థ పేర్కొంది.

ఫేక్ న్యూస్కు నో చాన్స్!
మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లతో పాటు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సాయంతో వార్తా జీపీటీ వరల్డ్వైడ్గా జరిగే అన్ని ఘటనలను గుర్తించి పూర్తి వివరాలను సరైన సమయానికి ప్రజలకు అందించగలదని తెలుస్తోంది. దీని కృత్రిమ మేధ(ఏఐ) అల్గారిథమ్‌లు సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు అనేక రకాల మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి పాఠకులకు వివరించగలవని తెలిసింది. అంతేగాక కచ్చితమైన, తాజా, నిష్పాక్షికమైన వార్తలను తయారుచేసే సామర్థ్యం దీని సొంతమని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

వరల్డ్వైడ్గా జరిగే రాజకీయ పరిణామాలు, ఆర్థిక శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు అనేక అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు అందించే శక్తి సామర్థ్యాలు న్యూస్ జీపీటీకి ఉన్నాయని ఉన్నాయని సమాచారం. మిగతా మీడియా సంస్థల్లా న్యూస్జీపీటీలో వచ్చే న్యూస్ అడ్వర్టైజర్లు, పొలిటికల్ లీడర్స్ లేదా వ్యక్తిగత అభిప్రాయాల ద్వారా ప్రభావితం కావని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీని అంతిమ లక్ష్యం ఎప్పటికప్పుడు కచ్చితత్వంతో కూడిన విశ్వసనీయమైన సమాచారాన్ని వీక్షకులకు చేరవేయడమేనని తెలిపింది. ప్రతి ఒక్కరూ తప్పుడు సమాచారాన్ని కాకుండా సత్యాన్ని తెలుసుకోవడానికే దీనిని తీసుకొచ్చామని లేవీ వివరించారు. మైక్రోసాఫ్ట్కు సంబంధించి ఓపెన్ ఏఐతో ‘జీపీటీ-4’ అనే సాంకేతికతతో న్యూస్ జీపీటీలోని వార్తలు ఫొటోలు, టెక్స్ట్ను తీసుకుంటున్నట్లు కంపెనీ చెప్పింది.

చాట్జీపీటీకి మరో పోటీదారు.. బైదు ఎర్నీబాట్ వచ్చేస్తోంది!
టెక్నాలజీ రివల్యూషన్లో భాగంగా వచ్చిన చాట్ జీపీటీకి సవాలు విసిరేందుకు మరో చాట్బాట్ అందుబాటులోకి వచ్చింది. అదే ఎర్నీబాట్. ఎర్నీ అంటే ఎన్హాన్స్డ్ రిప్రెజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటిగ్రేషన్. చైనాకు చెందిన బైదు అనే కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. దీన్ని తయారు చేయడానికి 650 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు కుడా చేసింది. అయితే ప్రస్తుతం ఎర్నీబాట్ ఇంకా సంపూర్ణంగా పనిచేయట్లేదని, చాట్జీపీటీకి ఉన్న డిమాండ్ కారణంగా తాము ఎర్నీబాట్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని బైదు సీఈవో రాబిన్ లీ చెప్పారు. కాగా, ఎర్నీ బాట్ తొలి వెర్షన్ను 2019లోనే డెవలప్ చేశామని లీ పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -