విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడని, అతనంటే ఎంతో గౌరవం ఉందన్నారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం వాటిల్లితే ప్రశ్నించడం కూడా తప్పే అన్నట్లుగా ప్రకాశ్ రాజ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అదే తప్పు మసీదులో, చర్చిలో జరిగితే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగినప్పుడు సాటి హిందువులంతా కలిసిగట్టుగా ముందుకు రావాలన్నారు. వైసీపీ నేతలు విచారణకు రమ్మంటే రికార్డులు, ఫైల్స్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కలిసి ఆలయాన్ని అపవిత్రం చేశారన్నారు. గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చారని విమర్శించారు.