Saturday, August 30, 2025

పటాన్‌చెరు కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు

Must Read

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్‌ కార్యకర్తలు యత్నించారు. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు కార్యకర్తలు మాత్రం ఆఫీసు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -