కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కేసులో తనపై ఎంక్వైరీ వేయకుండా ఆపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ముడా కేసును విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టులో చిక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం సిద్ధిరామయ్య ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మధురైలో భూసేకరణ సమయంలో సిద్ధిరామయ్య కుటుంబానికి మధురై అధికారులు విలువైన స్థలాలు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం ఆదేశాలతోనే అధికారులు విలువైన స్థలాలను రాసిచినట్లు ప్రతిపక్షాలు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా.. గవర్నర్ విచారణకు ఆదేశించారు.