Friday, November 22, 2024

‘దేవర’ ఎలా ఉందంటే!

Must Read

భారీ అంచనాలతో తెరకెక్కిన దేవర సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కాంబోలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా మొత్తం ఊపేస్తోంది. ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? పాత్రలు ఎలా ఉన్నాయి? దర్శకుడు ఈ సినిమాను ఎలా మలిచాడు? అనే విషయాల్ని తెలుసుకుందాం.

ఏపీ, తమిళనాడులో ఓ సముద్రం. ఆ సముద్రపు తీరంలో నాలుగు గ్రామాలు. ఆ నాలుగు గ్రామాలకు ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ రక్షకులు. సముద్రంలో వచ్చిన కొన్ని నౌకలు.. ఆయుధాల్ని అక్రమంగా రవాణా చేస్తుంటాయి. తొలుత సదరు వ్యాపారులకు ఇద్దరి హీరోలతో పాటు గ్రామస్తులు సహకరిస్తారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల తర్వాత ఇది అధర్మం అని తెలుసుకుంటాడు. ఆయుధాలు మానవాళికి ముప్పు అని, ఇతర మార్గాల్లో జీవనం సాగిద్దామని చెబుతాడు. కానీ అందుకు సైఫ్ అలీఖాన్ ఒప్పుకోడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులు ఉంటాయి.

జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. తమ నటనానుభవంతో పాత్రల్లో ఒరిగిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన మ్యూజిక్ తో కేక పుట్టించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లాస్ పాయింట్. ప్రతీ సీన్ లో వైవిధ్యమైన మ్యూజిక్ తో అదరగొట్టాడు అనిరుధ్. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ, శృతి తదితరులు ఎప్పటిలాగే వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఫస్ట్ హాఫ్ లో దేవర సినిమా అభిమానుల్లో జాతర పుట్టిస్తుంది. పాటలు, సినిమాటోగ్రఫీ థియేటర్లలో హైప్ పుట్టిస్తాయి. సెకండ్ హాఫ్ లో కాస్త గాఢత తగ్గిందనే చెప్పుకోవాలి కానీ ఇది పూర్తి సినిమాపై ప్రభావం చూపించదు. చివరగా… ఆరేళ్ల తర్వాత విడుదలైన దేవర.. ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంలో ముంచెత్తింది.

Today Bharat Rating: 3/5

- Advertisement -
- Advertisement -
Latest News

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక...
- Advertisement -

More Articles Like This

- Advertisement -