Wednesday, March 4, 2026

#todaybharat

కుంకీ ఏనుగుల‌ తొలి ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం

అడ‌వి ఏనుగుల నుంచి పంట‌ల‌ను ర‌క్షంచేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చొర‌వ‌తో క‌ర్ణాట‌క నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి...

నేటి నుంచి కాకినాడ‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

దేశ సేవ చేయాలనే యువతకు గొప్ప అవకాశం ల‌భించింది. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నేడు ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,...

నేడు ఈడీ ముందుకు అనిల్‌ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై ఆర్థిక నేరాల విభాగం (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అంబానీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆగస్టు 1న ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం...

ఎర్రకోటలో భద్రతా లోపం

దేశ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు కొద్ది రోజుల ముందే ఎర్రకోట భద్రతలో పెద్ద ఎత్తున లోపం బయటపడింది. ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక భద్రతా డ్రిల్‌లో విధుల్లో ఉన్న అధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.స్వాతంత్య్ర‌ వేడుకల్లో ప్రధాని ప్రసంగించే వేదిక కావడంతో ఎర్రకోటలో భద్రతా చర్యలు అత్యంత కట్టుదిట్టంగా ఉండాలి....

భారత్‌పై సుంకాలు మ‌రింత పెంచుతాం – ట్రంప్ హెచ్చ‌రిక‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌, రాబోయే రోజుల్లో ఈ సుంకాలను మరింత పెంచుతానని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు భారత్‌ చేసిన చమురు...

నేటి నుంచి షూటింగ్స్ బంద్

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్‌లోని అన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్‌ బంద్‌ చేస్తున్నట్లు ఫెడరేషన్‌ ప్రకటించింది. ఫెడరేషన్‌ డిమాండ్ల ప్రకారం, సిబ్బందికి కనీసం 30 శాతం వేతనాలు పెంచాలని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వేతనాలు పెండింగ్‌ లేకుండా రోజువారీగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం...

సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను గౌర‌వించాలి – కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

ప్ర‌జ‌ల కోసం సామాజిక బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్న సోష‌ల్ మీడియాను పాల‌కులు అవ‌మానించ‌డం త‌గ‌ద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ స‌మాజ‌ ఆకాంక్ష‌ల మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌టి నుంచి త‌న శ‌క్తి మేర‌కు ప‌ని చేస్తూనే ఉంద‌న్నారు. నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు తాను ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తుగా ఉంటానని...

బీఆర్‌ఎస్‌లో కవిత వ‌ర్సెస్ జగదీష్ రెడ్డి

బీఆర్‌ఎస్ లో అంతర్గత వివాదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “నన్నడానికి ఈ లిల్లీపుట్ ఎవరు?” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ “ఇన్‌సైడ‌ర్స్” తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ లేఖలు లీక్ చేశారంటూ...

గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరికలు జారీ

గాజా యుద్ధం ప్రభావంతో అక్కడి ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మానవతా సహాయం కోసం ఏర్పడిన తొక్కిసలాట విషాదానికి దారితీసింది. గాజాలోని జికిమ్ క్రాసింగ్ వద్ద మానవతా సహాయం చేరుకున్న సమయంలో ఆహారం కోసం భారీగా జనం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో 48 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, పదుల...

ఆపరేషన్ అఖల్‌.. ఆరుగురు ముష్కరుల మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ అఖల్ మూడో రోజుకు చేరుకుంది. కుల్గాం జిల్లాలోని అఖల్‌ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఆరుగురు ముష్కరుల‌ను మట్టుపెట్టారు.. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ఒకరు గాయపడ్డారు. ఆగస్టు 1న అఖల్‌ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న నిఘా సమాచారం...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img