సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించి, భక్తులను ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తనదని స్వర్ణలత ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా...
తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత 28, 29...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమయ్యారు. అయితే పార్టీ అధిష్టానం రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించడంతో పాటు, రాష్ట్ర బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్...
హైదరాబాద్‌లోని చెరువు భూముల పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగించటం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను రక్షించి ఆ భూములను తిరిగి ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు చెందిన భవనాలను సైతం హైడ్రా కూల్చి వేసింది....
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు , కార్యకర్తలకు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోదని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోదని, సమాజ సేవ చేయాలని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుందని...
ఇటీవల అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ గురువారం యశోద ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు...
రైతు రాజ్యం ఎవరు తెచ్చారు అనే దాని మీద కేసీఆర్, కేటీఆర్, మోదీ, కిషన్ రెడ్డి తనతో చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం.. నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని...
బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సందర్భంగా పదవి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తనకు పదవి దక్కకపోవడంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర...
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.ప్రతి ఏటా జూలై 4న రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఆయనను పరామర్శించేందుకు నేడు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి వెళ్లారు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, మధుమేహ సమస్యలతో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రాత్రి...
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...