బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారించడంపై స్పందిస్తూ, ఇది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని అన్నారు. న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు...
ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు గూగుల్, ఇజ్రాయెల్, యూఏఈ వంటి అంతర్జాతీయ భాగస్వాములు మద్దతు ప్రకటించగా, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, వాతావరణ, పట్టణ సమస్యల పరిష్కారంలో సహకారం అందించడానికి ఆసక్తి చూపారు. గూగుల్ వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఉదయం 6 గంటలకే కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతో పాటు సతీమణి, కూతురు, అల్లుడు, మనవరాళ్లు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించి...
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనలో మెస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రముఖం చేయడానికి మెస్సీని రాష్ట్ర గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. “సిగాచి పేలుడు బాధితులకు రూ. కోటి రూపాయల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చింది కేవలం 26 లక్షలు మాత్రమే. మిగతా 74 లక్షలు ఎక్కడ? ఇది మాట తప్పడం కాదా?” అని ప్రశ్నించారు. కార్మికులకు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు విషెస్ అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ రేవంత్ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ నేతకు జన్మదిన విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో తెలంగాణలో కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్ (వైస్ ప్రెసిడెంట్, AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ), విక్రమ్ శ్రీధరన్ (డైరెక్టర్,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. మంత్రులు ఇంటి ఇంటికీ తిరిగి ఓట్లు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 9 వరకు ఈ...