Sunday, June 7, 2026

హైదరాబాద్‌కు మెస్సీ రాక‌.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌లో సీఎం రేవంత్‌

Must Read

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనలో మెస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రముఖం చేయడానికి మెస్సీని రాష్ట్ర గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాత్రిపూట సచివాలయం నుంచి నేరుగా MCHRDకి వెళ్లి దాదాపు గంటసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెస్సీ పర్యటనతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -