Thursday, January 15, 2026

#election

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా ఉద్రిక్తత రెచ్చగొట్టినట్టు ఫిర్యాదు అందింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల‌ కోడ్ ఉల్లంఘన.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ కేసులు నమోదు చేశారు. అనధికారికంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించామని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మంద‌కొడిగా పోలింగ్‌

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు మొదలైంది. మొదటి రెండు గంటల్లో 9.2 శాతం ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. 4.01 లక్షల మంది ఓటర్లు 407 పోలింగ్ బూత్‌లలో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది. వెంగళ్ రావు నగర్...

జూబ్లీహిల్స్ పోలింగ్ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండండి: మంత్రులకు రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. మంత్రులు ఇంటి ఇంటికీ తిరిగి ఓట్లు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నవంబర్ 9 వరకు ఈ...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img