ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. లారా, టామీ బ్యూమాంట్, హేలీ మాథ్యూస్‌ను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైంది.