ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు లక్నో.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన రిషబ్ పంత్.. 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.