టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా ఉండొచ్చు.