టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అతడు ఈ ఫీట్ సాధించారు.